Saipallavi:ఆ వీరుడుతో 10ఏండ్లుగా లవ్..ఎవరో తెలిస్తే షాకే.?

నటన టాలెంట్ ఉండాలి కానీ ఏ ఇండస్ట్రీకి వెళ్లిన ఆదరణ దక్కుతుంది అనేది ఈ హీరోయిన్ ను చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేని యాక్టింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు 


Published Sep 03, 2024 08:51:40 AM
postImages/2024-09-03/1725333700_saipaallavilover.jpg

న్యూస్ లైన్ డెస్క్: నటన టాలెంట్ ఉండాలి కానీ ఏ ఇండస్ట్రీకి వెళ్లిన ఆదరణ దక్కుతుంది అనేది ఈ హీరోయిన్ ను చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేని యాక్టింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపింది.  న్యాచురల్ గా నటించే ఈ లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రచ్చ లేపడానికి సిద్ధమయింది.  ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే లేడీ ఎనర్జిటిక్ స్టార్ సాయిపల్లవి. తెలుగు ఇండస్ట్రీలో ఈమె అనేక చిత్రాల్లో నటించింది.

 ఇక సాయిపల్లవి చేసిన ఫిదా చిత్రం అందరికీ ఆకట్టుకుందని చెప్పవచ్చు. అలాంటి సాయిపల్లవి 10ఏళ్ళుగా ఒక వ్యక్తిని ప్రేమించిందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సాయిపల్లవి కేవలం నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా అదరగొడుతుంది. ఆమె తన డాన్స్ ద్వారానే నటన రంగంలోకి అడుగు పెట్టింది. అలాంటి సాయి పల్లవికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కథనే ప్రధానంగా తీసుకొని సినిమాల్లో నటించే సాయి పల్లవి ఎంబిబిఎస్ కూడా కంప్లీట్ చేసింది.

అలాంటి ఈమె ప్రస్తుతం పౌరాణిక జానపద సినిమా అయినటువంటి రామాయణంలో నటిస్తోంది.  ఇందులో రన్బీర్ కపూర్ శ్రీరాముడిగా సాయిపల్లవి సీతగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సాయిపల్లవి తాజాగా మహాభారతం కథ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.  అయితే  అర్జునుడి కొడుకు అభిమన్యుడితో తాను లవ్ లో ఉన్నానని తెలియజేసింది. ఆ పాత్ర సమయంలో నేను ఆయనతో ప్రేమలో పడతానని అన్నది.

10 ఏళ్లుగా అతనితోనే ప్రేమలో ఉండిపోతానని, అభిమన్యుడు పాండవులలో ఒకరైన అర్జునుడి కుమారుడని, ఈయన మహాభారతంలో కీలక పాత్రధారి అని మనందరికీ తెలుసు. నేను వీరాదివీరుడు అయినటువంటి అర్జునుడి కుమారుడు అభిమాన్యూన్ని  ప్రేమిస్తాను.  అంటే మేము డైరెక్ట్ గా ఒకరిని ఒకరు కలవము కానీ అతని గురించి నేను 10 సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ ప్రేమలో పడతాను  అంటూ సాయి పల్లవి చెప్పింది.  ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు మీరంతా వీరాధివీరులను ప్రేమిస్తే మేమంతా ఏమైపోవాలి అంటూ  ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu arjunudu mahabharatham tandel saipallavi abhimanyudu

Related Articles