ఈ వారం ఈ ఫ్యామిలీ ని ఎంటర్ టైన్ చేయడానికి ఓటీటీ లోకి రానుంది సారంగదరియా.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సరుకు దిగుతుంది. ఓటీటీలోకి వచ్చే సినిమాల్లో చాలా వరకు తెలుగు సినిమాలే . ఈ వారం తెలుగు సినిమాల రిలీజ్ లు చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో మంచి ఫ్యామిలీ డ్రామా సారంగదరియా .. అయితే ఈ వారం ఈ ఫ్యామిలీ ని ఎంటర్ టైన్ చేయడానికి ఓటీటీ లోకి రానుంది సారంగదరియా.
జూలై 12న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ప్రేక్షకులను అనుకున్న రేంజ్ లో మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు పద్మారావ్ అబ్బిశెట్టి దర్శకత్వం వహించారు. ఆగష్టు 31 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యలో థియేటర్ లో చిన్న సినిమాలు స్లోగానే నడుస్తున్నాయి. అలా అని ఫ్లాప్ అనడానికి లేదు. ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నాయి.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. మిడిల్ క్లాస్ వారికి ఎదురయ్యే సమస్యల చుట్టూ ఈ మూవీ కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ మూవీలో రాజా రవీంద్ర ఓ కాలేజ్ లో లెక్చరర్ గా అతని కొడుకు అర్జున్ లవ్ ఫెయిల్యూర్ . తాగి తిరుగుతుంటాడు. చిన్న కొడుకు కూడా ఎలాంటి పని లేకుండా.. ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. అతను కూడా ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. కూతురు మాత్రం చాలా మంచిది. పధ్ధతిగా ఉంటుంది. తండ్రి చెప్పినట్టే నడుచుకుంటుంది. ఇలా నడుస్తున్న టైంలో కూతరు గురించి ఓ విషయం బయటపడుతుంది. కళ్ల ముందు అంత పధ్ధతిగా ఉండే అమ్మాయి ఇలా అయిదేంటని ఫాధర్ క్యారక్టర్ చాలా బాధపడతాడు. ఈ విషయంతో కొడుకులు సాయం చేస్తారా...అసలు దారిలోకి వచ్చాడా అనేదే సినిమా.