SHIVA BALAJI: తెలుగు యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివ బాలాజీ !

యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌పై నటుడు శివ బాలాజీ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఇండస్ట్రీ పీపుల్ తో పాటు వారి ఫ్యామిలీ ని కూడా టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నారని అన్నారు.


Published Sep 08, 2024 05:40:37 PM
postImages/2024-09-08//1725797437_4fb0560de7db4cecbbb2725da65ab026.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో శివబాలాజీ పరిచయం ఎందుకు...అటు సినిమాలు ..ఇటు బిగ్ బాస్ విన్నర్ ... యూట్యూబ్ , సోషల్ మీడియా ఇలా అన్ని రకాలుగా జనాల్లో టచ్ లోనే ఉన్నాడు. వెబ్ సీరిస్ లతో కూడా చింపేస్తున్నాడు. రీసెంట్ గా ‘శాకుంతలం’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు.  


రీసెంట్ గా ఓ తెలుగు యూట్యూబర్ పై పోలీస్ కేసు పెట్టారు శివబాలాజీ. తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్‌ ట్రోల్స్‌ చేస్తున్న యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌పై నటుడు శివ బాలాజీ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఇండస్ట్రీ పీపుల్ తో పాటు వారి ఫ్యామిలీ ని కూడా టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అంతా కలిసి చంద్రహాసన్ పై కేసు నమోదు చేశారు.


 నటీనటులతోపాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్‌కు ఉన్న   గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్‌ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. మా అసోసియేషన్ కు శివబాలాజీ కోశాధికారి అది అందరికి తెలిసిందే. ఆర్టిస్టులకు కాని వారి కుటుంబాలకు కాని హాని కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : police movie-news manchu-vishnu youtuber cyber-security

Related Articles