Shobhita Boyfriend : ప్రేమ అతడితో.. పెళ్లి చైతూతో.. శోభిత మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరంటే..!

మొన్నటి వరకు శోభితా ధూళిపాళ్ల ఎవరనేది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె ఎవరు? ఆమె వివరాలేంటి? అనే దానిపై ఫోకస్ పెట్టారు. గూగుల్, సోషల్ మీడియాలో శోభితా ధూళిపాళ్ల గురించి సెర్చ్ చేస్తున్నారు.


Published Aug 09, 2024 02:19:10 PM
postImages/2024-08-09/1723193350_shobithawithchaithuandfirstboyfriend.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇప్పుడు నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం టాఫిక్ హాట్ టాఫిక్ గా మారింది. మొన్నటి వరకు చాటుమాటుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట ఎంగేజ్ మెంట్ తో ఒక్కటయ్యారు. అయితే అప్పటి వరకు శోభితా ధూళిపాళ్ల ఎవరనేది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె ఎవరు? ఆమె వివరాలేంటి? అనే దానిపై ఫోకస్ పెట్టారు. గూగుల్, సోషల్ మీడియాలో శోభితా ధూళిపాళ్ల గురించి సెర్చ్ చేస్తున్నారు. గతంలో ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. కొన్నాళ్ల పాటు ఇద్దరు కలిసి తిరిగారని, కానీ అనుకోకుండా విడిపోయారని తెలుస్తోంది.

శోభితా ధూళిపాళ్ల గతంలో ప్రణవ్ మిశ్రాతో డేటింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రణవ్ మిశ్రా ఓ ఫ్యాషన్ డిజైనర్. వీళ్లిద్దరు రామణ్ రాఘవ్ 2.Oతో వీళ్లిద్దరి కలిశారు. ఆ సినిమా తర్వాత ప్రణబ్ మిశ్రా, శోభితా కొంత కాలం కలిసి ఉన్నారు. అంతేకాదు ఇద్దరు కలిసి ఫారిన్ ట్రిపుల్లో విహారించారు.

పెళ్లి చేసుకుంటామని, డేటింగ్ లో ఉన్నామని అధికారికంగా ఎప్పుడు చెప్పలేదు.  కానీ అనూహ్యంగా ఈ జంట విడిపోయింది. ప్రణవ్ మిశ్రాతో విడిపోయిన తర్వాతే నాగచైతన్యతో టచ్ లోకి వచ్చింది శోభిత. మరోవైపు నాగచైతన్య సమంతాతో విడిపోవడం, ఇటు శోభిత సైతం ప్రణవ్ మిశ్రాతో విడిపోవడంతో.. ఇద్దరూ ఒక్కటయ్యారు. కొంత కాలం డేటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు.

newsline-whatsapp-channel
Tags : viral viral-news nagarjuna samantha nagachaitanya latest-news news-updates nagachaitanya-

Related Articles