Sridevi:శ్రీదేవితో ఆ పనికి శోభన్ బాబు నో చెప్పారట..చివరికి రాఘవేంద్రరావే చేసేశారా.?

రాఘవేంద్రరావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. ఈయన చిత్రం అంటే తప్పనిసరిగా ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఏ సినిమాలో అయినా ఆ సాంగ్ చాలా డిఫరెంట్ గా


Published Jul 30, 2024 11:03:18 PM
postImages/2024-07-31/1722398583_sridevi.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాఘవేంద్రరావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. ఈయన చిత్రం అంటే తప్పనిసరిగా ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఏ సినిమాలో అయినా ఆ సాంగ్ చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తారు. ఆ చిత్రానికి అదే హైలైట్ గా నిలుస్తుంది.  అలా రాఘవేంద్రరావు శోభన్ బాబు శ్రీదేవి కాంబోలో అనేక చిత్రాలు తెరికేక్కాయి. ఇందులో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన చిత్రం దేవత. ఈ మూవీలో శోభన్ బాబు హీరోగా చేస్తే హీరోయిన్లుగా శ్రీదేవి, జయప్రద అక్కచెల్లెళ్ల పాత్రలో నటిస్తారు. శ్రీదేవి   అక్క కోసం తన జీవితాన్ని త్యాగం చేసే పాత్ర ఇందులో హైలైట్ అని చెప్పవచ్చు.

రొమాన్స్, లవ్, ఎమోషన్స్ కలగలిపి తీసినటువంటి ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది చక్రవర్తి సంగీతం. "వెల్లువెత్తి గోదారమ్మ" పాట ఇప్పటికీ ఫేమస్. ఈ పాట చిత్రీకరణ సమయంలో ఒక అనూహ్యమైన ఘటన జరిగిందట.  ఆ వివరాలు ఏంటో చూద్దాం. గోదావరి నది పాయల మధ్య ఇసుకలో ఈ పాట చిత్రీకరణ చేయాలి. అప్పటికే అంతా బిందెల సెట్టింగ్స్ పెట్టేశారు. ఇక హీరో హీరోయిన్స్ వెళ్లి ఆ పాటకు డాన్స్ చేయాలి. ఆ లొకేషన్ వెళ్లడానికి ఒక చిన్న పాయ దాటవలసి ఉంటుంది.  

నది బయట శ్రీదేవి తన మేకప్ అంతా వేసుకొని రెడీ అయిపోయింది. మళ్లీ శ్రీదేవి నీటిలో అడుగు పెడితే మేకప్ అంతా చెడిపోతుంది బట్టలు తడిసిపోతాయి.  దీంతో రాఘవేంద్రరావు శోభన్ బాబుతో ఇలా అన్నారట.  శోభన్ బాబు గారు మీరు ఆమెను ఎత్తుకొని పాయ దాటించాలని చెప్పారట. దీంతో ఆయన నో చెప్పడంతో, చేసేదేమీ లేక రాఘవేంద్రరావే శ్రీదేవిని ఎత్తుకొని పాయ దాటించి, షూటింగ్ పూర్తయ్యాక మళ్ళీ ఎత్తుకొని ఒడ్డున చేర్చారట. విషయాన్ని రాఘవేంద్రరావు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది.

newsline-whatsapp-channel
Tags : news-line shobanbabu sridevi devatha raghavendrarao

Related Articles