Fateh: సోనూసూద్ ఫతే మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సోనూసూద్ ఫతే సినిమాను జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Published Jul 30, 2024 07:39:43 AM
postImages/2024-07-30/1722343162_sonu.PNG

న్యూస్ లైన్ సినిమా: బాలీవుడ్‌ స్టార్‌, రియల్‌ హీరో సోనూసూద్‌ కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. సాయం కోరివచ్చిన వారిని అక్కున చేర్చుకున్నాడు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా భావించారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో కష్టాల్లో ఉన్న అభిమానులకు, పలువురికి సాయం చేసి వార్తల్లో నిలిచారు. 

ప్రస్తుతం సోనూసూద్ నటిస్తున్న సినిమా ‘‘ఫతే’’. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్లీన్ ఫెర్డస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. మంగళవారం సోనూసూద్ పుట్టిన రోజు సందర్భంగా మూవీయూనిట్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతూ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. సోనూసూద్ ఫతే సినిమాను జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో సోనూసూద్ ఉన్నట్లు సమాచారం. అయితే జనవరి 10న విశ్వంభర ప్రేక్షకుల ముందు రానుంది. దాంతో చీరు, సూద్ బాక్స్‌ఆఫీస్ వద్ద గట్టి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. 

newsline-whatsapp-channel
Tags : chiranjeevi tollywood movie-news vishvambhara cinema-news

Related Articles