Spider man: పోలీసులకు చిక్కిన స్పైడర్ మ్యాన్‌.. ఏం చేశాడో తెలుసా!

స్పైడర్ మ్యాన్ లాగా డ్రెస్ వేసుకొని కార్ బానెట్ పై తిరిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Published Jul 24, 2024 10:05:03 AM
postImages/2024-07-24//1721830522_spiderman.jpg

న్యూస్ లైన్ డెస్క్: స్పైడర్ మ్యాన్ లాగా డ్రెస్ వేసుకొని కార్ బానెట్ పై తిరిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల స్పైడర్ మ్యాన్ లాగా బట్టలు వేసుకొని కార్ బానెట్ పై కూర్చొని వెళ్లిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అయ్యింది. అయితే అతని పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిర్యాదు చేయగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయడం, విన్యాసాలు చేయడం సహా పలు ఉల్లంఘనల కోసం ఢిల్లీ పోలీసులు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

స్పైడర్ మ్యాన్ వేషం వేసిన అతను నజఫ్‌గఢ్‌కు చెందిన ఆదిత్య (20)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు వ్యక్తిపై కేసు నమోదు చేసి 26 వేలు రూపాయలు ఫైన్ వేశారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడవద్దని పోలీసులు యువతను హెచ్చరించారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana police delhi arrest

Related Articles