Tamannaah: ఆ నటుడి ఫోన్ లో తమన్నా 5వేల ప్రైవేట్ ఫోటోలు..చూస్తే మైండ్ బ్లాక్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో  ఈమె కూడా ఒకరు. అలాంటి తమన్నా  మంచు విష్ణు హీరోగా చేసిన   శ్రీ అనే సినిమా 


Published Aug 29, 2024 09:12:11 AM
postImages/2024-08-29/1724902931_tamannaahprivatepphotos.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో  ఈమె కూడా ఒకరు. అలాంటి తమన్నా  మంచు విష్ణు హీరోగా చేసిన   శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ  చిత్రం అంతగా హిట్ కాకపోవడంతో  మరోసారి హ్యాపీ డేస్ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక అప్పట్నుంచి తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా పలు ప్రైవేట్ సాంగ్స్ లో కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోంది.

అలాంటి తమన్నా  బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో గత కొంతకాలంగా లవ్ ట్రాక్ నడిపిస్తోంది. అంతేకాదు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు అనేక వార్తలు వినిపిస్తున్నాయి.  అలాంటి తమన్నాకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు తాజాగా విజయ్ వర్మ తెలియజేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తమన్నా విజయ్ వర్మ  లస్ట్ స్టోరీస్ 2 చిత్ర షూటింగ్ సమయంలో కలిశారు. ఈ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. క్రమక్రమంగా అది పెరిగిపోయి  ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.

అలా వీరి ప్రేమ బంధాన్ని డైరెక్ట్ గా బయట కూడా పెట్టేశారు. అయితే వీరి రిలేషన్ గురించి తాజాగా విజయ్ వర్మ  ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమన్నాతో నా రిలేషన్ ను ఎక్కడ దాచుకోవాలనుకోలేదు,  స్వేచ్ఛగా ఉండాలని అనుకునే నాలాంటి వాళ్లకు దాచుకొని తిరగడం సాధ్యం కాదు. మా బంధాన్ని అందరి ముందు తెలియజేశాను. అయితే మా మధ్య ఇంకా మీకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి.

తమన్నా అంటే నాకు ఎంతో ఇష్టమని, ఆమెకు సంబంధించినటువంటి ఫోటోలు 5000 వరకు నా దగ్గర దాచుకున్నానని  చెప్పాడు. లవర్స్ ఎక్కడైనా కలిసినప్పుడు తప్పకుండా ఫోటోలు తీసుకొని జ్ఞాపకంగా ఉంచుకుంటారని,  ఆ విధంగానే మా మధ్య జ్ఞాపకంగా 5000 ఫోటోలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయం  విజయ్ వర్మ బయట చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఇక వీరి పెళ్లి విషయం  గురించి మాత్రం విజయ్ వర్మ ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. ఆ వివరాలను టైం వచ్చినప్పుడు  ప్రకటిస్తానని అన్నారు. ప్రస్తుతం విజయ్ వర్మ ఐసి 814 కాందహార్  అటాక్ అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tamannaah private-photos vijay-varma lust-stories-2

Related Articles