నందమూరి ఫ్యామిలీ అంటే చాలా పెద్దది. ఇందులో బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. తారకరత్న కూడా మొదట్లో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన
న్యూస్ లైన్ డెస్క్:నందమూరి ఫ్యామిలీ అంటే చాలా పెద్దది. ఇందులో బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. తారకరత్న కూడా మొదట్లో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అనుకున్నంత రాణించలేకపోయారు. ఇదే తరుణంలో తారకరత్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమించారు. వీరి ప్రేమను నందమూరి కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో బయటకు వెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటినుంచి తారకరత్న తన కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చారు.
వారికి పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబానికి దగ్గర అవుతున్న తరుణంలో తారకరత్న యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురై మరణించారు. దీంతో అలేఖ్య రెడ్డి ఒంటరి అయిపోయింది. చివరికి ఆయన మరణం తర్వాత అయినా ఫ్యామిలీ వారి పిల్లలను, ఆమెను దగ్గరికి తీస్తారని అనుకున్నారు.
కానీ అది ఇది జరగలేదని తెలుస్తోంది. తాజాగా అలేఖ్య రెడ్డిని ఒక అభిమాని తారకరత్న మరణించిన తర్వాత అయినా మీరు ఫ్యామిలీకి దగ్గర అయ్యారా అని ప్రశ్నించారు. దీనిపై అలేఖ్య స్పందిస్తూ గతంలో మాకు ఎవరూ లేరు, ఇప్పుడు కూడా ఎవరూ లేరు. అప్పుడు ఇప్పుడు ఎలాంటి తేడా లేదు, నా జీవితాన్ని నేనే బ్రతుకుతున్నాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని సమాధానం ఇచ్చింది. నందమూరి ఫ్యామిలీ చాలా డేంజర్ నన్ను ఆదరించడం లేదని, కేవలం లోకేష్ గారు మాత్రమే నాకు సహకారం అందించారని చెప్పుకొచ్చింది. షర్మిలతో ఉన్న బంధం చెప్పలేని దంటు మా ఇద్దరినీ దేవుడే కలిపాడంటూ ఎమోషనల్ అయింది.