హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి ఏఐ రంగంలో పేరొందిన ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, ఐబీఎం నుంచి డానియెలా కాంబ్, XPRIZE ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సు కు హాజరయ్యారు. ఏఐ రంగం అభివృద్ధికి తమ ఆలోచనలను పంచుకుంటూ భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చించనున్నారు.