Allu Arjun: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక.. అల్లు అర్జున్‌కు ఆహ్వానం

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బుధవారం పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు.


Published Aug 28, 2024 07:59:58 PM
postImages/2024-08-28/1724855398_pushpaaa.PNG

న్యూస్ లైన్ సినిమా:  టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైటెక్ సిటీ నోవోటెల్ హోటల్‌లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను జరుపనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బుధవారం పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు.


హీరో బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘తాతమ్మ కల’ మూవీలో ఇండస్ట్రీకి పరిచాయం అయ్యారు. ఈ సినిమా 1974వ సంవత్సరం ఆగస్టు 30న విడుదలైంది. కాగా, ఈ నెల ఆగస్టు 30తో బాలకృష్ణ నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ వర్గం అంతా కలిసి స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇటిల ఈ వేడుకకు సంబంధించిన పోస్టర్ కూడా నిర్వాహకులు విడుదల చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana tollywood allu-arjun cinema-news balakrishna-50-years-invitation-card

Related Articles