Group-2: తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. 


Published Aug 22, 2024 06:01:41 AM
postImages/2024-08-22/1724324438_group2.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. గురువారం మధ్యాహ్నం తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. 2022 డిసెంబర్‌లో  28/2022 నంబర్‌తో విడుదలైన నోటిఫికేషన్‌కు ఈ ఏడాది చివర్లో పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. 
 
డిసెంబర్‌ 15, 16న గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్‌ 15న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్-1 నిర్వహిస్తారు. డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2 ఎగ్జామ్ జరగనుంది.

డిసెంబర్‌ 16న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్-3 పరీక్ష జరగనుండగా.. 16న మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్‌-4 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam groups groups-aspirants tgspsc

Related Articles