ఆ స్టార్ హీరోయిన్ పెళ్ళై ఏడాది కాలేదు.. అప్పుడే విడాకులా.?

ఈ మధ్యకాలంలో  చాలామంది సినీ నటులు  చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో ఇదే తంతు


Published Jul 28, 2024 08:08:29 AM
postImages/2024-07-28/1722172097_chopra.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో  చాలామంది సినీ నటులు  చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో ఇదే తంతు కొనసాగుతోంది. చాలామంది హీరో హీరోయిన్లు మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ విడాకుల బాట పడుతున్నారు. చివరికి వారు విడిపోయి ఆ తర్వాత ఎవరి లైఫ్ వారు బతుకుతున్నారు.  అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఈ హీరోయిన్ కూడా  విడాకుల బాట పట్టినట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరు ఆ వివరాలు చూద్దాం..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరి పరిణితి చోప్రా గురించి అందరికీ తెలుసు. ఈమెకు బాలీవుడ్ లో ఎంతో గుర్తింపు ఉంది. ప్రియాంక చోప్రా సోదరిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కానీ తనకంటూ సొంతంగా ఇమేజ్ ఏర్పాటు చేసుకుంది. అలా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈమె  ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో  లవ్ లో పడి వివాహం చేసుకుంది. అలాంటి ఈమె వివాహం జరిగే సంవత్సరకాలం కూడా గడవ లేదు. ఇంతలోనే ఆయనతో విడాకులు తీసుకోబోతుందని వార్త వినిపిస్తున్నాయి.

అయితే దీనికి ప్రధాన కారణం ఆమె ఈ మధ్య చేసినటువంటి ఒక పోస్టు.. దీన్ని చూసిన ఎవరైనా సరే  పరిణితి చోప్రా విడాకులు తీసుకుంటుందనే భావిస్తారు. నా జీవితాన్ని ప్రతిబింబించడానికి కొంత టైం తీసుకున్నాను. ఇది నా నమ్మకాన్ని పునరుద్ఘాటించింది. మైండ్ సెట్ అనేది ప్రతిదీ అప్రధానమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వకండి. ఒక్క సెకండ్ కూడా వృధా చేయకు.. నీ లైఫ్ ఒక గడియారం..

ప్రతిక్షణం మీకు ఇష్టం వచ్చినట్టు గడపాలి తప్ప ఇతరులను ఆకట్టుకోవడానికి జీవించడం మానేయండి. ఇతరుల అభిప్రాయాలకు తగ్గట్టుగా మీ సొంత జీవితాన్ని గడిపితే మీ జీవితంలో మీకు ప్రత్యేకత ఉండదు. మీ లైఫ్ లో ఉన్నటువంటి విషపూరితమైన వ్యక్తులను విసిరేయడానికి భయపడకండి. పక్క వారు ఏమనుకుంటారు అని భయపడితే మీ సంతోషాన్ని, మీ లైఫ్ ని మీరే కోల్పోతారు. ఈ చిన్న లైఫ్ లో మీరు ఎలా జీవించాలి అనుకుంటున్నారో అలా జీవించండి అని రాసుకోచ్చరు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఆమె  విడాకులు తీసుకుంటానని హింట్ ఇస్తోందా అని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : priyanka-chopra newslinetelugu divorce bolly-wood parinithi-chopra raghava-chadda

Related Articles