అమ్మాయి తప్పు చేయాలనుకుంటే కనీసం పక్కనున్న వ్యక్తికీ కూడా తెలియదట. చేయొద్దు అనుకుంటే అస్సలు చేయదట. అలాంటి అమ్మాయిల మనసులో ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్ గా మనకు
న్యూస్ లైన్ డెస్క్: అమ్మాయి తప్పు చేయాలనుకుంటే కనీసం పక్కనున్న వ్యక్తికీ కూడా తెలియదట. చేయొద్దు అనుకుంటే అస్సలు చేయదట. అలాంటి అమ్మాయిల మనసులో ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్ గా మనకు చెప్పలేరు. వారి జీవిత సహచరుడితో కొన్ని విషయాలను పంచుకోలేక సీక్రెట్ గా ఆలోచిస్తారట. అది అబ్బాయిలు గ్రహించుకొని వారికి తగ్గట్టుగా మసులుకోవాలని అంటున్నారు. మరి అమ్మాయిలు సీక్రెట్ గా ఏం ఆలోచిస్తారు అనే వివరాలు చూద్దాం.
గౌరవం:
కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అంటే చాలా చీప్ గా చూస్తుంటారు. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న భార్యను నువ్వు నా భార్య నేను చెప్పినట్టు ఉండాలి అంటూ దబాయిస్తారు. కానీ అమ్మాయిలు భర్తగా తనకు గౌరవం ఇవ్వాలని తన అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలని అనుకుంటారట. ఇలా ఉంటేనే వీరి మధ్య బంధం కూడా బలపడుతుంది.
ప్రోత్సాహం :
ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు మోటివేట్ చేసే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎమోషనల్ గా వారికి సపోర్ట్ చేసే వారిని వారు ఎప్పటికీ మర్చిపోలేరు. అలా వారి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారట.
ప్రేమ:
అయితే చాలామంది అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రేమను పొందాలనుకుంటారు. కానీ వారికి మనపై ఎంత ప్రేమ ఉందో అసలు చెప్పరు. సీక్రెట్ గా లోపల దాచుకొని అబ్బాయి చూపించే ప్రేమలో వారు మునిగిపోతారు. కాబట్టి అబ్బాయి నుంచి వారు ప్రేమను తప్పనిసరిగా కోరుకుంటారు.
కోరికలు:
అమ్మాయిలు వారికి కలిగిన కొన్ని కోరికలను డైరెక్ట్ గా చెప్పుకోలేరు. సీక్రెట్ గా మనసులోనే ఉంచుకొని అబ్బాయిలకు అర్థమయ్యేలా సిగ్నల్స్ ఇస్తారట. నిజంగా అర్థం చేసుకున్న అబ్బాయి అయితే ఆమె సిగ్నల్స్ ను గమనించి ఆమెకి ఎలాంటి కోరికలు ఉన్నాయో అవి తీర్చాలని అంటున్నారు నిపుణులు.