Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పెళ్లి వీడియో !

ఇరు పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో కూర్గ్ లో  రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేశాడు .


Published Aug 23, 2024 10:56:00 AM
postImages/2024-08-23/1724390958_8d04589caee75a520e73968a654d18f51724380996952313original.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ ఇంటి వాడయ్యాడు. తన ఫస్ట్ సినిమా హీరోయిన్ తన లైఫ్ హీరోయిన్ అయ్యింది. మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు ఈ జంట. ఇరు పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో కూర్గ్ లో రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేశాడు . క‌ర్ణాట‌క కూర్గ్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగినట్లు సమాచారం.

అయితే చాలా తక్కువ మంది సెలబ్రెటీస్ ఈ పెళ్లికి హాజరయ్యారు. రహస్య గోరక్ ఎంట్రీ, జీలకర్ర బెల్లం, కిరణ్ అబ్బవరం తాళి కడుతున్న వీడియో ఇలా కొన్ని వీడియోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ముందు మూడు రోజులు హాల్దీ, మెహందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలన్నీ ...రహస్య తన అకౌంట్ నుంచి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఇఫ్పుడు పెళ్లి వీడియో పోస్ట్ చేయడంతో ఫుల్ వైరల్ అవుతుంది.

2019 నవంబర్లో విడుదలైన రాజావారు రాణి గారు సినిమా షూటింగ్ లో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు ప్రేమించుకున్నారు. అంతుకు ముందు వీరిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేశారు. యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో సినిమాల్లోకి వచ్చారట. ఫస్ట్ సినిమాకే ప్రేమికులుగా మారి ..ఇఫ్పుడు భార్యా భర్తలుగా ప్రమోట్ అయ్యారు. కాని దాదాపు ఐదేళ్లు వీరి ప్రేమను చాలా సీక్రెట్ గా ఉంచి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding kiran-abbavaram rahasya-gorakh

Related Articles