Fish Venkat: నటుడు ఫిష్ వెంకట్‌కు నిర్మాత అర్థిక సాయం

నటుడు ఫిస్ వెంకట్‌కు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు లక్ష రూపాయల చెక్కును అందించారు.


Published Sep 05, 2024 08:26:48 AM
postImages/2024-09-05/1725505008_fishvenkat.PNG

న్యూస్ లైన్ డెస్క్: నటుడు ఫిస్ వెంకట్‌కు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు లక్ష రూపాయల చెక్కును అందించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వీడియోలో చెప్పడంతో సినీ నిర్మాతలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, టీఎఫ్‌పీసీ ట్రెజరర్, నిర్మాత రామ సత్యనారాయణ, సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకుడు కె. అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్  ఫిష్ వెంకట్‌కు రూ. లక్ష చెక్కును అందించారు. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా ఫిష్ వెంకట్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, గత కొంత కాలంగా మూవీస్‌కు ఆయన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకట్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఎవరైనా ఆదుకోవాలని అగిడే పరిస్థితికి వచ్చిందని ఓ వీడియోలో తన బాధ చెప్పుకున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్తే.. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, డయాలసిస్ చేయాలని డాక్టర్లు చెప్పారని తెలిపాడు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని తెలిపాడు. దీనికి తోడు బీపీ, షుగర్ కూడా వచ్చాయని చెప్పుకొచ్చాడు. దీంతో కాలికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపాడు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో సినిమాల్లో అవకాశం వచ్చినా చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా తనకు సహాయం చేయాలని ఆయన వేడుకున్నాడు. 

newsline-whatsapp-channel
Tags : telangana tollywood movie-news producer money fish-venkat

Related Articles