Animal Movie : రిచ్ పార్టీని పట్టిన యానిమల్ బ్యూటీ.. త్వరలో పెళ్లి

మొన్నటికి మొన్ననే కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన ఈ భామకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు అభిమానుల హార్ట్ బ్రేక్ చేస్తోంది. త్వరలోనే త్రిప్తి డిమ్రీ పెళ్లి పీటలెక్కనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.


Published Aug 09, 2024 07:06:40 PM
postImages/2024-08-09/1723210600_triptidimri.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. రష్మిక మందన్నతో పాటు హాట్ బ్యూటీగా నటించి అందరినీ ఆకట్టుకున్న బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన త్రిప్తికి ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే.. తన అందచందాలు, హావభావాలతో కొత్త అవకాశాలను ఒడిసి పట్టుకుంటోంది. అయితే.. ఇప్పుడు ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

మొన్నటికి మొన్ననే కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన ఈ భామకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు అభిమానుల హార్ట్ బ్రేక్ చేస్తోంది. త్వరలోనే త్రిప్తి డిమ్రీ పెళ్లి పీటలెక్కనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ అబ్బాయిని ప్రేమించిందని.. చాలాకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు చెప్తున్నారు.

ప్రముఖ బిజినెస్ మ్యన్ సామ్ మర్చంట్ ను త్రిప్తి త్వరలో పెళ్లి చేసుకోబోతోందట. కొంతకాలం క్రితమే సామ్ మర్చంట్ తో త్రిప్తి ప్రేమలో పడిందని.. పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాదు.. సామ్ మర్చంట్ మంచి క్యాష్ పార్టీ అని.. త్రిప్తి చాలా తెలివిగా డబ్బున్నోడినే పట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : tollywood bollywood- tripti-dimri latest-news news-updates ranbeer-kapoor

Related Articles