Varun: కొత్త మొగుడా.. వరుణ్ సందేశ్ భార్యపై ట్రోల్స్.?

వరుణ్ సందేశ్.. ఒకప్పుడు హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, మరోచరిత్ర, ఏమైంది ఈవేళ వంటి సినిమాలతో యూత్ స్టార్ గా మారిపోయి ఎంతోమంది కుర్ర కారుకి ఫేవరెట్ హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు.


Published Aug 06, 2024 04:12:59 PM
postImages/2024-08-06/1722940979_varunvithika.jpg

న్యూస్ లైన్ డెస్క్: వరుణ్ సందేశ్.. ఒకప్పుడు హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, మరోచరిత్ర, ఏమైంది ఈవేళ వంటి సినిమాలతో యూత్ స్టార్ గా మారిపోయి ఎంతోమంది కుర్ర కారుకి ఫేవరెట్ హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అయితే అలాంటి వరుణ్ వచ్చిన స్టార్డం ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత ఈయన చేసిన వరుస సినిమాలు ప్లాప్ అవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.

అయితే వరుణ్ సందేశ్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.వీరాజీ,నింద వంటి సినిమాలతో మళ్ళీ టాలీవుడ్లో యాక్టివ్ అయ్యారు. అయితే తాజాగా వరుణ్ సందేశ్ భార్య నటి వితిక షెరూపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది..మరి ఆ ట్రోలింగ్ కి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.నటి వితికా షెరు వరుణ్ సందేశ్ తో కలిసి ఓ సినిమాలో నటించే సమయంలో ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఇక పెళ్లయ్యాక వితిక సినిమాలకు దూరమైంది. అయితే మళ్లీ తన జీవితంలో ఒక అడుగు ముందుకు వేసి కొత్త ప్రయాణం చేయాలని చూస్తోంది.ఇందులో భాగంగా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో న్యూ బిగినింగ్ అంటూ వితికా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది.

ఓ నటుడితో సన్నిహితంగా దిగిన ఫోటో వితిక షేర్ చేయడంతో దీనిపై చాలామంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఏంటి కొత్త మొగుడా.. ఆ ఫొటోస్ ఏంటి. క్యాప్షన్ ఏంటి అలా పెట్టావ్? ప్రమోషన్స్  కోసమే ఇలాంటి స్టంట్స్ చేస్తున్నావా.. ఆ ఫోటోని సడన్ గా చూస్తే ఏమైపోతారు అంటూ వితికా పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/C-UKRY8MnQ5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vithika-sheru varun-sandesh viraji ninda happy-days

Related Articles