Bollywood : రిలీజ్‌లో రూ.12 కోట్లు.. రీ-రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లు కలక్షన్లంటే ఇవి!

ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ కంటే రీ రిలీజ్ లోనే కలెక్షన్స్ ఎక్కువ సాధించాయి.


Published Oct 05, 2024 03:23:00 PM
postImages/2024-10-05/1728122023_tummbad.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనం సినిమాలు చాలా చూస్తుంటాం. కాని ఒక్క సినిమా చూస్తున్నపుడు మాత్రం అరే థియేటర్ లో చూసి ఉంటే బాుగండు అనిపిస్తుంది. అలా థియేటర్లో మాత్రమే చూస్తే సూపర్ గా అనిపించే సినిమా తుంబాడ్..మైథలాజికల్ థ్రిల్లర్ వాట్ సినిమా...రిలీజ్ టైంలో అసలు ఎవ్వరు ఊహించలేదు కాని ..రిలీజ్ అయ్యాక ఫ్యూజులు ఎగిరిపోయింటాయి.


 ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ కంటే రీ రిలీజ్ లోనే కలెక్షన్స్ ఎక్కువ సాధించాయి. హిట్ సినిమాలే కాదు ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి మెప్పించాయి. కాని తుంబాడ్ సినిమా మాత్రం సూపర్ డూపర్ రీరిలీజ్.ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. మైథలాజికల్ హారర్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన ఈ మూవీకి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా ద‌ర్శక‌త్వం వ‌హించారు. అసలు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా.


ఈ సినిమా రీ రిలీజ్‌లో రూ. 30కోట్లు వసూల్ చేసింది. 2018లో చిన్న సినిమాగా విడుదలైన ‘తుంబాడ్’ అప్పుడు కేవలం రూ. 12కోట్లు రాబట్టింది.  అప్పుడు సినిమా మీద అంత బజ్ లేదు . కాని ఇప్పుడు  అలా కాదు. ఇప్పుడు రీరిలీజ్ లో మాత్రం అన్ని ఇండస్ట్రీల్లోను దుమ్ముదులిపేసింది. హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేశారు. ఇక రీ రిలీజ్‌లో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీరిలీజ్ లో డబుల్ కలక్షన్లు కొట్టిన సినిమా ఇదే.

newsline-whatsapp-channel
Tags : movie-news re-release collections thumbbad-movie

Related Articles