Dog vs Lion: గ్రామసింహం వర్సెస్ అడవి సింహం.. ఏది గెలిచిందంటే?

రెండు గ్రామసింహలు.. రెండు అడవి సింహలు ఇద్దరూ హోరాహోరి తలపడ్డారు.


Published Aug 14, 2024 05:50:56 PM
postImages/2024-08-14/1723638056_dog.PNG

న్యూస్ లైన్ డెస్క్: రెండు గ్రామసింహలు.. రెండు అడవి సింహలు ఇద్దరూ హోరాహోరి తలపడ్డారు. గోవుల షెడ్డు గేటు వ‌ద్ద‌ ఒక‌వైపు సింహాలు, మ‌రో వైపు కుక్క‌లు కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని అమ్రేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గేటు వ‌ద్ద ఉన్న సీసీ కెమెరాకు సింహాలు, కుక్క‌ల‌కు చెందిన విన్యాసం చిక్కింది.

గోవుల షెడ్డు లోప‌లికి రావడానికి సింహాలు ప్ర‌య‌త్నించాయి. అయితే గేటుకు మ‌రో వైపు ఉన్న రెండు కుక్క‌లు అరుస్తూ ఆ సింహాల‌ను అడ్డుకున్నాయి. నాలుగు జంతువులూ అరుస్తూ.. గేటును అటూ ఇటూ ఊపేశాయి. ఈ ముఖాముఖికి దాదాపు రెండు గంటల పాటు రసవత్తరంగా సాగింది. అయితే ఐర‌న్ గేటు కవడంతో శున‌కాలు సరక్షితంగా ఉన్నాయి. కాగా, కాసేప‌టి త‌ర్వాత స‌మీపంలో ఉన్న పొద‌ల్లోకి సింహాలు పారియాయి. అటవీ ప్రాతం నుంచి సింహాలు వ‌చ్చి ఉంటాయ‌ని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఫారెస్ట్ అధికారుల నుంచి ఇలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు  వావ్ వాటే ఫైట్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana viral-news street-dogs social-media fighting

Related Articles