Pawan Kalyan : ఉస్తాద్ వస్తున్నాడు.. బర్త్ డే ట్రీట్ రెడీ


Published Aug 30, 2024 08:06:41 PM
postImages/2024-08-30//1725028601_ustad.jpg

న్యూస్ లైన్ డెస్క్ :  ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.

త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి.. డిసెంబర్ నాటికి మీ ముందుకు తీసుకొస్తామని మూవీ టీమ్ ప్రకటన చేసింది. అయితే.. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ స్పెషల్ ట్రీట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : pawankalyan pawan-kalyan tollywood movie-news birthday harish-shankar latest-news news-updates

Related Articles