venuswamy: నాగ చైతన్య ఎప్పటికి తండ్రి కాలేడు..సంచలన కామెంట్లు చేసిన వేణుస్వామి

మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు.  నాగచైతన్య , శోభిత లు సంతోషంగా కనిపిస్తారు


Published Aug 13, 2024 08:40:00 AM
postImages/2024-08-13/1723518643_nagachaithnya.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉందని.. అక్కడి నుంచి వీరి వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు.  నాగచైతన్య , శోభిత లు సంతోషంగా కనిపిస్తారు కాని సరిగ్గా ఉండలేరని ..ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చెయ్యలేరని తెలిపారు.


 ఈ వీడియోలో వేణు స్వామి మాట్లాడుతూ.. 'నాగచైతన్య జాతక రిత్యా తండ్రి స్థానం బలంగా లేదు. అది తన తండ్రి స్థానం కావచ్చు. లేకపోతే నాగచైతన్య తండ్రిగా మారడం కావచ్చు. పెంపకం విషయంలో లోటు, పాట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. నాగచైతన్య కు సంతానం కలిగే అవకాశం లేదని..ఉన్నా వారి పెంపకం సరిగ్గా లేక.. మంచి తండ్రి అనిపించుకోలేరని తెలిపారు. అలాగే వివాహం తదుపరి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. నాగచైతన్యకు మాత్రం సహజసిద్ధంగా తండ్రి అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తన జాతకబలం అలాంటిదని వేణు స్వామి బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 


అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం జరిగిందో అనూహ్యంగా.. నన్ను సెలబ్రెటీ జాతకాలు అడగకండి..నేను చెప్పలేను. నన్ను ఇబ్బంది పెట్టకండి... అంటూ వీడియో రిలీజ్ చేశాడు.. గతంలో కూడా ఇలా చెప్పారంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagachaitanya venuswamy

Related Articles