Vikramarkudu: రవితేజను దంచి కొట్టిన నటి గుర్తుందా..ఇప్పుడు చూస్తే షాకే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి అంటే ఎంతటి ప్రాచుర్యం ఉందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఈయన ఇండియాలోనే టాప్5 దర్శకులలో ఒకరిగా మారారు. అలాంటి దర్శకుడు రాజమౌళి


Published Aug 14, 2024 08:35:15 PM
postImages/2024-08-14/1723647915_raviteja.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి అంటే ఎంతటి ప్రాచుర్యం ఉందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఈయన ఇండియాలోనే టాప్5 దర్శకులలో ఒకరిగా మారారు. అలాంటి దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏ చిత్రం కూడా ఇప్పటివరకు ఫ్లాప్ అయితే కాలేదు. అలాంటి జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ విక్రమార్కుడు. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించారు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో డబుల్ యాక్షన్ లో నటించారు.  

ఇందులో అత్తిలి సత్తిబాబు పాత్ర కామెడీగా చూపిస్తే విక్రమ్ రాథోడ్ పాత్ర పవర్ ఫుల్ గా చూపించారు. ఈ విధంగా ఈ చిత్రం అద్భుత హిట్ అయింది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ  అందరికీ గుర్తుండే ఉంటారు. ఇందులో ముఖ్యంగా రవితేజకు మరియు కొంతమంది మహిళలకు ఒక చిన్న కామెడీ ఫైట్ లో రవితేజ ఆ మహిళలను జుట్టుపట్టుకొని కొడతాడు ఆ మహిళలు కూడా రవితేజను జుట్టుపట్టుకుని విపరీతంగా కొడతారు. ఇందులో ఒక నటి అయితే రవితేజను చాలా దారుణంగా కొట్టి ఆయస పడుతూ ఉంటుంది. క్యారెక్టర్ లో ఆమె అద్భుతంగా నటించింది.  ఆ రవితేజను కొట్టిన నటి పేరు జయవాణి.

https://www.instagram.com/reel/C-LDyUvy05b/?igsh=MWZncHBvc3Nla3NjcA==

ఈ సన్నివేశానికి ముందు  జయవాణి రవితేజను కొట్టాలంటే చాలా భయపడిందట. రవితేజయే వాళ్ల దగ్గరికి వెళ్లి ఏం కాదండి మీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టండి అని చెప్పారట. దీంతో వారు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ అయి సీను అద్భుతంగా పండేలా చేశారు. రవితేజను కొట్టే సీన్ లో ఉన్నటువంటి జయవాణి ప్రస్తుతం  సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. తనకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. జయవాణి ప్రస్తుతం  ఎలా ఉందో మీరు కూడా చూడండి

newsline-whatsapp-channel
Tags : news-line ss-rajamouli raviteja vikramarkudu jayavani

Related Articles