అందులో రూ. 12 వేల కోట్లు అదానీకి సంబంధించినవే అని ఆయన అన్నారు. ఓ వైపు అదానీతో పోరాటానికి రాహుల్ పిలుపునిస్తాడు.. రేవంత్ అదానీతో దోస్తీ చేస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూస్ లైన్ డెస్క్: పాత కోడకు కొత్త సున్నం కొట్టినట్టు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని BRS నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి పర్యటనలో ఏదో సాధించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో మాజీ ఐటీ శాఖ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్లు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. లక్షల ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.
కేటీఆర్ పర్యటనలను మేమెప్పుడూ పబ్లిసిటీ కోసం వాడుకోలేదని అన్నారు. రేవంత్ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు ఉత్సవ విగ్రహంగా మారారని విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ విదేశీ పర్యటనలో ఆయన పది సెకండ్లు కూడా మాట్లాడిన వీడియో లేదని అన్నారు. దావోస్‌లో కూడా రూ. 34 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రేవంత్ ప్రచారం చేసుకున్నారు. అందులో రూ. 12 వేల కోట్లు అదానీకి సంబంధించినవే అని ఆయన అన్నారు. ఓ వైపు అదానీతో పోరాటానికి రాహుల్ పిలుపునిస్తాడు.. రేవంత్ అదానీతో దోస్తీ చేస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.
ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లుల వసూలు కోసం అదానీ సంస్థను వాడుకోవాలని రేవంత్ ఆలోచిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. అదానీ విషయంలో రాహుల్ కరెక్టా, రేవంత్ కరెక్టా కాంగ్రెస్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోడీ సంస్థ రూ.ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని దావోస్‌లో ప్రకటించారు. కానీ, అది ఫ్రాడ్ సంస్థగా తేలిందని అన్నారు. రేవంత్ యూఎస్, కొరియా పర్యటన కూడా దావోస్ తరహాలోనే అయ్యిందని విమర్శించారు. సీఎంఓ వెల్లడించిన వివరాల్లో కూడా రూ .31,500 కోట్ల లెక్క తేలడం లేదని ఆయన అన్నారు.