న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కార్తీక మాసంలో ప్రసిధ్ద శివక్షేత్రాలను దర్శించుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది. శివ భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. శివ క్షేత్రాలైన...శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
కార్తీకమాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం వంటి అంశాలపై చర్చించారు. ఆర్టీసీకి కార్తీక మాసం, శబరిమల ఆపరేషన్స్ ఎంతో కీలకమని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకంుడా చూసుకుంటామని తెలిపారు.మరీ ముఖ్యంగా ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ కంపల్సరీ అని సూచించారు. ఇక అద్దె ప్రాతిపదిక అందించే ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించినట్లు సజ్జనర్ తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డిలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. శబరిమలై యాత్రకు కూడా ...తాము బస్సులు రెంట్ కు ఇస్తున్నట్లు తెలిపారు.