దోసాంజ్ మ్యూజిక్ కన్సర్ట్ లో వీటిపై పాటలు చాలా సాధారణం . కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఫేమస్ సింగర్ కమ్ యాక్టర్ దల్జీజ్ దోసాంజ్ మ్యూజిక్ కన్సర్ట్ ఈ రోజే . ఈ మ్యూజిక్ కచేరీపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఆంక్షలు విధించింది. దల్జీత్ తో పాటు ‘దిల్-లుమినటి’ కచేరీ నిర్వాహకులకు నోటీసులు పంపింది. మద్యం, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఎలాంటి పాటలు ఆలపించవద్దని ఆదేశించింది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. దోసాంజ్ మ్యూజిక్ కన్సర్ట్ లో వీటిపై పాటలు చాలా సాధారణం . కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దోసాంజ్ గతంలో డ్రగ్స్, మద్యంపై పాడిన పాటల వీడియో సాక్ష్యాలను చండీగఢ్‌కు చెందిన పండిట్‌రావ్ ధరేన్వర్ సమర్పించిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీలో కూడా జవహర్ లాల్ స్టేడియం లో ఆల్కహాల్ , డ్రగ్స్ ను ప్రోత్సహిస్తూ ...జోష్ కోసం కొన్ని పాటలు పాడారట.జైపూర్‌తోపాటు పలు అంతర్జాతీయ వేదికలపైనా ‘దిల్ లుమినటి’ కన్సర్ట్‌లో దోసాంజ్ ఇలాంటి పాటలు ఆలపించాడు.
దీని వల్ల పంజాబీ గాయకుడు అయిన దల్జీత్ దోసాంజ్ దిల్ లుమినటి టూర్ దేశ వ్యాప్తంగా నగరాల్లో గత నెల న ప్రారంభమైంది. అందులో భాగంగా నేడు హైదరాబాద్ లో మూడో షో చేస్తున్నారు. ఈ షోకి టికెట్లు కూడా భారీగా అమ్ముడయ్యాయి. మరి పోలీసుల జాగ్రత్తలు ఎంత వరకు పనిచేస్తాయో చూడాలి.