Laxmi devi:లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందంటే కనిపించే సంకేతాలివే.?

మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మనం ఎలాంటి పనులు మొదలు పెట్టాలన్న తప్పనిసరిగా మంచి టైం చూసి ప్రారంభిస్తూ ఉంటాం. శుభ ముహూర్తంలో ఏది


Published Aug 22, 2024 06:40:34 AM
postImages/2024-08-22/1724289034_laxmi.jpg

న్యూస్ లైన్ డెస్క్: మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మనం ఎలాంటి పనులు మొదలు పెట్టాలన్న తప్పనిసరిగా మంచి టైం చూసి ప్రారంభిస్తూ ఉంటాం. శుభ ముహూర్తంలో ఏది ప్రారంభించిన మనకు మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతాం. అలా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  మనం ధనవంతులు కాబోతున్నాం అని తెలిపే కొన్ని అదృష్ట సంకేతాలు ఉంటాయట.  ఈ సంకేతాలు మనకు కనిపించినట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని  వారంటున్నారు. మరి ఆ సంకేతాలు ఏంటి వివరాలు చూద్దాం..

 మనకు అదృష్టం పట్టబోతుంది అంటే మంగళవారం రోజున ఇంటి పైకప్పు మీదికి కోతులు వచ్చి  అల్లరి చేస్తాయట. అంతేకాకుండా మనం దేవుడికి కొట్టే కొబ్బరికాయ కూడా కుళ్ళిపోతుందట. అంతేకాకుండా మనం పెట్టే దీపం నుండి చప్పుడు వస్తుందట. ఇక ఇవే కాకుండా మనం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో, లేదంటే ఏదైనా దేవాలయం నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో తెల్లటి ఆవు దూడ కనిపించడం కూడా అదృష్ట సాంకేతమే.

అలాగే కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు కింద పడడం. అంతేకాకుండా నెమలి నాట్యం చేస్తూ కనిపించడం.  మరీ ముఖ్యంగా నల్ల చీమలు ఇంట్లోకి ధారలా రావడం. అలాగే కొబ్బరికాయలో పువ్వు కనిపించడం. ఈ విధమైన సంకెతాలు మనకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోవాలి.

newsline-whatsapp-channel
Tags : news-line laxmidevi money home good-time

Related Articles