ద్రి మూవీ రేణుదేశాయ్ లైఫ్ నే మార్చేసింది. మోడల్ గా రేణుదేశాయ్ ..మెగా ఇంటి కోడలయ్యింది. పవన్ వైఫ్ అయ్యింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నపుడు సోషల్ మీడియా అంతా ఎంగేజ్ మెంట్ పిక్స్ తో దుమ్ముదులిపేశారు ఫ్యాన్స్. కాని ఏమైందో ఆ ముచ్చట పెళ్లి వరకు రానే లేదు. బద్రి మూవీ రేణుదేశాయ్ లైఫ్ నే మార్చేసింది. మోడల్ గా రేణుదేశాయ్ ..మెగా ఇంటి కోడలయ్యింది. పవన్ వైఫ్ అయ్యింది. అకీరా, ఆద్యలు పుట్టాక మనస్పర్థలతో విడిపోయారు. తనకు తెలియకుండా అన్నా లెజినోవాతో రిలేషన్ పెట్టుకుని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా కన్నాడని రేణు దేశాయ్ చాలా సార్లు చెప్పారు కూడా.
తరచుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో రేణు దేశాయ్ కి సోషల్ మీడియా వార్స్ చోటు చేసుకుంటాయి. ట్రోల్స్ తట్టుకోలేక ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ వదిలేశారు. సోషల్ సర్వీస్ కోసం ఇంస్టాగ్రామ్ మాత్రం ఉపయోగిస్తున్నారు. రీసెంట్ గా రేణుదేశాయ్ తన రెండో పెళ్లి ఎందుకు ఆగిపోయిందో చెప్పుకొని చాలా బాధపడ్డారు.
రేణుదేశాయ్ అంటే వాళ్ల పేరెంట్స్ కు ఇష్టం లేదట. మగపిల్లాడు పుడతాడని అనుకున్నారట. పుట్టకపోయేసరికి నిరాశ చెంది వాళ్ల నాన్న ..తనను చూడడానికి కాని ముట్టుకోవడానికి కాని అస్సలు ఒప్పుకోలేదట. తల్లి కూడా తండ్రి తోపాటే ఉందని ...నన్ను పనిమనిషి పెంచిందని చెప్పింది. మా నాన్న ఆడపిల్లనని..చంపడానికైనా ముట్టుకోవాలిగా ..ముట్టుకోవల్సి వస్తుందని చంపలేదు. మీకు తెలీదు పేరెంట్స్ పక్కనపెడితే పిల్లలు మానసికంగా ఎంత బాధపడతారో ...అందుకే రెండో పెళ్లి వద్దనుకున్నా. లైఫ్ ని ఇలా పిల్లలతో ...పిల్లల కోసం గడుపుతాను అంటు చెప్పుకొచ్చింది.