తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో, మెగా ఇంటి కోడలు ఉపాసన ఫ్యామిలీ అంటే కూడా రాష్ట్రంలో అంతటి గౌరవం ఉంటుంది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో, మెగా ఇంటి కోడలు ఉపాసన ఫ్యామిలీ అంటే కూడా రాష్ట్రంలో అంతటి గౌరవం ఉంటుంది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ అయినటువంటి ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన. ఆమె అంత పెద్ద సంపన్నురాలైనా కానీ ఇప్పటికీ సింపుల్ గా జీవితాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఉపాసన హీరో రామ్ చరణ్ ను ప్రేమించి వివాహం చేసుకొని 11 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
ఎప్పుడైతే మెగా ఫ్యామిలీలో ఆ ఆడబిడ్డ అడుగు పెట్టిందో అప్పటి నుంచి వీరి ఫ్యామిలీలో అన్ని శుభవార్తలే వస్తున్నాయి. ముఖ్యంగా మనవరాలు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చిరంజీవికైతే పట్టరాని ఆనందం ఉందని చెప్పవచ్చు. ఆ విధంగా మనవరాలికి క్లింకారా అనే పేరు పెట్టి ఇప్పటివరకు ఆమె ఫేస్ ను కనిపించకుండా కవర్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడైనా ఫంక్షన్స్ వెళ్లినప్పుడు క్లింకారాని తీసుకెళ్లిన ఆమె ఫేస్ కనిపించకుండా ఏదైనా ఏమోజి పెట్టి కవర్ చేస్తున్నారు. ఈ విధంగా ఉన్న మెగా కోడలు ఉపాసన తాజాగా మహిళల కోసం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.
ఇండియన్ స్కూల్ ఆఫ్ కళాశాలలోని ఒక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ హెల్త్ కేర్ రంగంలో వ్యాపారం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి యువ మహిళలకు తాము సపోర్ట్ చేస్తామని తెలియజేశారు. ఉపాసనతో చేతులు కలపండని అన్నారు.. అలాగే వారికి కోపౌండర్ పార్ట్నర్ను అవుతానని తెలియజేశారు. ఈ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం ఇండియాలో హెల్త్ కేర్ సిస్టంలో మార్పులు తీసుకురావడానికి సహాయం చేస్తానని తెలియజేశారు. Cofounder@urlife.co.in అనే వెబ్సైట్లో వివరాలు పొందుపరచవచ్చని అన్నారు.