KTR: తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం నందినగర్ నివాసంలో ఘనంగా జరిగింది.


Published Jul 24, 2024 10:05:44 AM
postImages/2024-07-24/1721832669_birthda2.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం నందినగర్ నివాసంలో ఘనంగా జరిగింది. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురుతో కలిసి తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తల్లి శోభమ్మ లకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు. 

ఈ సందర్భంగా కుమారుడు కేటీఆర్‌ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్, మిఠాయీలు తినిపించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు. కుమారునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నంది నగర్‌కు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేటీఆర్ ఫొటోలు దిగారు. 

newsline-whatsapp-channel
Tags : kcr telangana brs ktr birthday brs-cheif

Related Articles