మహారాష్ట్రకు చెందిన ముగ్గురు విద్యార్థులు దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశారు. పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఖుష్బు అగర్వాల్ ను ఆశ్రయించి టికెట్లు బుక్ చేసుకున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జాలీ గా దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఓ స్టూడెంట్ గ్యాంగ్ కు పూణె కస్టమ్స్ షాక్ ఇచ్చింది. పూణేకు చెందిన ముగ్గురు స్టూడెంట్స్ దుబాయ్ ట్రిప్ కు ప్లాన్ చేసుకున్నారు. ఓ ట్రావెల్ ఏజెంట్ ను కలిసి టికెట్స్ బుక్ చేసుకున్నారు కూడా. తీరా చూస్తే ట్రావెల్ ఏజెంట్ చేసిన పనికి స్టూడెంట్స్ కు గుండె జాలి నేల పడిపోయినట్లయ్యింది. ఇంతకీ ఏం జరిగినందంటే..
మహారాష్ట్రకు చెందిన ముగ్గురు విద్యార్థులు దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశారు. పూణేకు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఖుష్బు అగర్వాల్ ను ఆశ్రయించి టికెట్లు బుక్ చేసుకున్నారు. పూణే ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ కు బయలుదేరారు. లాస్ట్ మినిట్ లో ఎయిర్ పోర్టుకు వెళ్లే టైంలో ఆ స్టూడెంట్స్ కు రెండు ట్రాలీ లో బ్యాగులు అందించి వాటిని దుబాయ్ లోని వారి ఆఫీస్ కు అందించాలని ప్లీజ్ హెల్ప్ చెయ్యలంటూ బతిమాలాడింది. దీంతో లోపల నిజంగా ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయని అనుకున్న స్టూడెంట్స్ ఆ ట్రాలీస్ ని తీసుకొని దుబాయ్ విమానం ఎక్కారు.
దీంతో అప్రమత్తమైన పూణే కస్టమ్స్ అధికారులు దుబాయ్ అధికారులను సంప్రదించారు.దుబాయ్ లో ల్యాండైన విద్యార్థులను పూణే కస్టమ్స్ అధికారుల విజ్ఞప్తి మేరకు దుబాయ్ అధికారులు వెనక్కి పంపించారు. పూణే చేరుకున్నాక విద్యార్థుల లగేజీ చెక్ చేయగా.. పుస్తకాల మధ్య దాచిన డాలర్ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 4,00,100 డాలర్ల ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని ఖష్బూ అగర్వాల్ ఫ్లాట్ లో సోదాలు జరపగా రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించిందని పోలీసులు తెలిపారు. అయితే ఖుష్బూ అగర్వాల్ ఆ విద్యార్ధులను మభ్యపెట్టి ఈ కేసులో ఇరికించినట్లు పోలీసులు తెలిపారు.