తెలంగాణ అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంయుక్తంగా మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఫెస్టివల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కవ్వాల్ పరిధిలో అటవీ శాఖ అధికారులు బర్డ్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ములుగు జిల్లా , సిధ్దిపేట జిల్లా అటవీ కళాశాలలు పరిశోధన సంస్థ విద్యార్ధులు తెల్లవారుజాము నుంచే అటవీ ప్రాంతంలో కలియ తిరిగారు. తెలంగాణ అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంయుక్తంగా మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఫెస్టివల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కవ్వాల్ అభయారణ్యం గాంధారివనంలో పక్షులు కిలకిలరావాలతో కొత్త శోభ సంతరించుకుంది. వలస వస్తున్న పులులే కాదు పక్షులు కూడా కవ్వాల్ టైగర్ జోన్ లోకి ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి. వందల రకాల పక్షులు విభిన్న రకాల వన్యప్రాణులు , వలస వస్తున్న విదేశీ పక్షులు ప్రకృతి ప్రేమికుల కెమరాల్లో అందంగా బంది అవుతున్నాయి. కవ్వాల్ టైగర్ జోన్ లో సాగుతున్న ‘బర్డ్ ఫెస్టివల్‘ అటు విద్యార్థులకు ఇటు పక్షి ప్రేమికులకు నయనానందాన్ని కలిగిస్తున్నాయి.మార్చి 1,2 తేదీల్లో రెండు రోజుల్లో పాటు బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది అటవీశాఖ.
గాంధరి వనంలోకి విద్యార్థులను పక్షుల సందర్శనకు తీసుకెళ్లారు. సన్ రైజ్ తో పాటు పక్షుల శబ్దం...చాలా అధ్భుతంగా ఉంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్లంతా బర్డ్స్ ఫొటోస్ తీసుకున్నారు.