viral video: వామ్మో..జనాలను కొట్టడానికి వచ్చిన ఏఐ రోబో !

చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో AI నియంత్రణలో ఉన్న ఒక రోబో అకస్మాత్తుగా అక్కడున్న జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది


Published Feb 28, 2025 12:21:00 PM
postImages/2025-02-28/1740725557_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  వాహ్ చాలా ఆర్టిఫిషియల్ వచ్చింది..టెక్నికల్ గా చాలా డవలప్ అయిపోతాం అనుకున్నాం కాని దీని వల్ల లాభాల కన్నా...నష్టాలే ఎక్కువ .ఇది వర్క్ స్మార్ట్ చేయడమే కాకుండా భవిష్యత్‌లో మానవాళి మనుగడకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదని ఇప్పటికే సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఏఐ  తో ఆడవాళ్లకే కాదు ...టెక్నికల్ గా నాన్ టెక్నికల్ గా , క్రైమ్ , ఇలా ప్రతి అంశంలోను ఏఐ తో ఇబ్బందే. మోసాలు నేరాలు ఎక్కువైపోతున్నాయి. అయితే ఈ మధ్య ప్రాణ భయం కూడా పట్టుకుంది.


మనుషులకు శారీరక శ్రమను తగ్గించడానికి వచ్చిన ఏఐ రోబోలు కూడా తిరగబడుతున్నాయి. అయితే, చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో AI నియంత్రణలో ఉన్న ఒక రోబో అకస్మాత్తుగా అక్కడున్న జనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. రోబో దాడి ప్రజలను ఒక్క క్షణం భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే పక్కనున్న వ్యక్తులు ఆ రోబోను కంట్రోల్ చేశారు. సాఫ్ట్ వేర్ లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని నిర్వహకులు చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఎప్పటికైనా ఏఐ తో ఇబ్బందులే కాని ..బెనిఫిట్స్ చాలా తక్కువని అంటున్నారు నెటిజన్లు. 

 

newsline-whatsapp-channel
Tags : artificial-intelligence viral-video videos robo-

Related Articles