మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా షాపూర్ తాలూకాలోని గర్గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కాకి మాట్లాడుతుందంటేనే వింత....అందులోను మరాఠీ మాట్లాడుతుందంటే మరీ విచిత్రం . ఈ మధ్య మరాఠీ మాట్లాడట్లేదని ...మరాఠీ సోదరులు తెగ సీరియస్ అయిపోతున్నారు. రీసెంట్ గా ఓ వాచ్ మెన్ కొట్టారు కూడా ...మరి భయపడిందో ఏమో తెలీదు కాని ...చక్కగా చిన్నపిల్లలు మాట్లాడినట్లు ముద్దుగా మరాఠీ మాట్లాడేస్తుంది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా షాపూర్ తాలూకాలోని గర్గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముకానే అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం ఒక కాకి దొరికింది. పాపం నీళ్లు లేకో...దెబ్బలు తగిలాయో చాలా నీరసంగా పడిఉంటే ఇంత రొట్టె పెట్టి కాసిన్ని నీళ్లు ఇచ్చింది. ఇక అంతే అప్పటి నుంచి వాళ్ల ఇంట్లోనే ఉంటూ ..వాళ్లతోనే పెరుగుతుంది. వాళ్లతో మరాఠీ కూడా మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్లు మాట్లాడే.. ‘‘అమ్మా, నాన్నా, దాదా, దాదీ, మామ, మామి’’.. ఇలా వివిధ అనేక పదాలను పలుకుతుండడం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతుంది.
వీడియోలో చెక్క బల్లపై నిలబడ్డ కాకి.. తన ‘‘కాకా.. కాకా’’.. అంటూ ఎవరినో పిలుస్తోంది. ఇలా చాలా సేపు ఆ కాకి.. అలా పిలుస్తూ ఎదురు చూస్తు నిలబడింది. కామెంట్లు మాత్రం క్రేజీ గా ఉన్నాయి. ఇక ఈ కాకి ముంబై లో ఉండడానికి అర్హత సాధించిందంటూ కామెంట్లు చేస్తున్నారు.