ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో ఆసీస్ మాజీ ఆటగాడు మెర్వ్ హ్యూస్‌తో కలిసి నాలుగు రోజుల ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్లాడు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బోథమ్ కు జస్ట్ మిస్ లో ప్రమాదం తప్పిపోయింది. ఏదో సరదాగా బోటు ప్రయాణానికి వెళ్తున్న బోటుపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెయ్ ప్లేయర్ మెర్వ్ హ్యూస్ వెంటనే కాపాడారు.
ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో ఆసీస్ మాజీ ఆటగాడు మెర్వ్ హ్యూస్‌తో కలిసి నాలుగు రోజుల ఫిషింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో పడవ ఎక్కే సమయంలో బోథమ్ అదుపుతప్పి మోయల్ నదిలో పడిపోయాడు. మోయల్ నదిలో మొసళ్లు , బుల్ షార్క్ లు చాలా ఎక్కువ. పొరపాటున పడినా ప్రాణం పోయినట్టే. అయితే ఈ ప్రమాదంలో బోథన్‌కు వీపు పక్క భాగం, మరికొన్ని చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే కాపాడడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారని అభిప్రాయపడ్డారు ఫ్యాన్స్.
బోథమ్, హ్యూస్ వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ మంచి మిత్రులు. బోథమ్‌కు ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఫిషింగ్‌కు హ్యూస్‌తో కలిసి వెళ్లాడు. ఈ హాలిడే ట్రిప్ లో ఇలా జరగడం బాధాకరం అని ..ప్రమాదం జరగలేదు కాబట్టి చాలా లక్కీ అనే చెప్పాలంటూ తెలిపారు ఇయాన్.