పాక్ ఉగ్ర కమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఈ ఉస్మాన్ సిధ్దహస్తుడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తారు. మరికొందరు అతి తెలివితో దొరికిపోతారు. శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్ కౌంటర్ వివరాలను సీఆర్ పీ ఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి. పాక్ ఉగ్ర కమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఈ ఉస్మాన్ సిధ్దహస్తుడు.
గత ఏడాది పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వనీని చంపిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. తను ఉన్న ఏరియాలో కూడా చాలా జాగ్రత్తగా కుక్కలను ట్రైన్ చేస్తూ ఉంచాడు ఉస్మాన్. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే అరుస్తాయి.అలాంటప్పుడు తను అలర్ట్ అవ్వడానికి పలాన్ చేసుకున్నాడు.
దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో సక్సస్ ఫుల్ గా ఉస్మాన్ ను పట్టుకున్నారు పోలీసులు.