దాదాపు30 వేల నోట్లు తయారుచేసి మార్కెట్ లో చలామణి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; ఎంత తెలివి ఉన్నా...పనికి రాని వాటికి వాడితే అవి చావు తెలివితేటలే. యూపీ లోని సోన్ భద్ర జిల్లాలో ఇద్దరు కుర్రాళ్లు యూట్యూబ్ చూసి నకిలీ కరెన్సీ తయారుచేయడం నేర్చుకున్నారు. అయితే దాదాపు30 వేల నోట్లు తయారుచేసి మార్కెట్ లో చలామణి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అంతేకాదు...చూడడానికి పర్ఫెక్ట్ నార్మల్ కరెన్సీ లాగే ఉన్నాయని అయితే వారు అన్ని నోట్లకు ఒకే సీరియల్ నెంబర్ వేయడంతో దొరికిపోయారని తెలిపారు పోలీసులు.
నిందితులు సతీశ్ రాయ్, ప్రమోద్ మిశ్రా పది రూపాయల స్టాంప్ పేపర్లపై నకిలీ రూ. 500 నోట్లను ముద్రిస్తున్నారు. మీర్జాపూర్ నుంచి స్టాంప్ పేపర్ కొనుగోలు చేసి ఈ దందాను నడుపుతున్నట్లు వెల్లడించారు. 20 రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నిందితుల నుంచి నకిలీ కరెన్సీ నోట్లతో పాటు ఆల్టో కారు, నోట్ల ముద్రణకు ఉపయోగించే పరికరాలు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 27 స్టాంప్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి నఖిలీ నోట్లతో పాటు ...చాలా ఫేక్ దందాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.