bird : విమానం ఈ పక్షిని చూసే కనిపెట్టారేమో .. ఎంత ఫాస్ట్ గా ఎగుురుతుందో !

దీని స్పీడ్ ముందు అసలు ఎవరు పనిచెయ్యరు. అసలు ఈ హమ్మింగ్ బర్డ్ గురించిన విషయాలు తెలుసుకుందాం.


Published Jan 05, 2025 06:23:00 PM
postImages/2025-01-05/1736081733_Hummingbirdstockbirdse9845edbea.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఏదైనా చిన్న వయసులో బోలెడంత పేరు వస్తుంటే పిట్ట పిల్లంత కూత గోరంత అంటూ ఉంటారు. ఊర పిచ్చుక పై బ్రహ్మస్తమా అంటూ చిన్నవైన పిచ్చుకలను అంత ఈజీగా తీసి పారేయలేం. దీని స్పీడ్ ముందు అసలు ఎవరు పనిచెయ్యరు. అసలు ఈ హమ్మింగ్ బర్డ్ గురించిన విషయాలు తెలుసుకుందాం.


* పిచ్చుకల కన్నా చిన్నగా ఉండే ‘హమ్మింగ్‌ బర్డ్‌’ గురించి తెలుసా? ఇవి కేవలం మన చేతి బొటన వేలు అంతే ఉంటాయి. కాని అవి రెక్కలు కదుపుతున్నాయనే విషయం కూడా మీకు అర్ధం అయ్యేలోపే ఆ పక్షి రెక్కలు కొన్ని వేల సార్లు కదుపుతుంది.


* ప్రపంచంలోనే అత్యంత చిన్న పక్షుల్లో ఒకటైన దీనికి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. పక్షుల్లో అత్యంత వేగంగా రెక్కలు ఆడించగలిగేవి. ఇవే . పక్షులేవైనా ఎగిరే టైంలో జస్ట్ ముందుకు మాత్రమే వెళ్తాయి. కాని క్ష్మ్మింగ్ బర్డ్స్ మాత్రం ముందుకు వెనక్కి ఎలాగైనా అప్పకటికప్పుడు దిశను మార్చుకుంటూ ఎగరగలవు. అంతేకాదు పూల నుంచి తేనెను పుడ్ గా తీసుకుంటాయి. ఇదే ఈ బర్డ్ స్పెషల్ .


* అలాంటి హమ్మింగ్‌ బర్డ్స్‌ రెక్కలు కూడా సరిగా కనబడనంత వేగంగా ఆడిస్తూ... ఓ వ్యక్తి చేతిలోని పానీయాన్ని తాగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ‘ఎక్స్‌’లో దీనిని పోస్టు చేసిన మూడు, నాలుగు గంటల్లోనే లక్షకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news birds

Related Articles