ఇంత కఠినంగా ఉండడం కరెక్ట్ కాదని తెలిపింది. చిన్న కారణాలకే ఉద్యోగంలో నుంచి తొలగించడం సరికాదని హితవు పలికింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆఫీస్ అంటేనే రూల్స్ ...అందరికి తెలిసిందే. అయితే పనికి మాలిన రూల్స్ పెట్టినా ఉద్యోగులు ఊడుకోరు. డ్రెస కోడ్ పాటించలేదనే కోపంతో ఉద్యోగం లో నుంచి తీసేశారు ఓ కంపెనీ. స్పోర్ట్స్ షూ వేసుకున్నందుకు గాను ఆమెను ఉద్యోగం లో నుంచి తీసేశారు. దీనిపై బాధితురాలు ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా.. కంపెనీ తీరుపై మండిపడ్డ ట్రైబ్యునల్, బాధితురాలికి ఏకంగా 30 వేల పౌండ్లు (సుమారు రూ.32 లక్షలు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా జాయిన్ అయిన వారిపై ఇంత కఠినంగా ఉండడం కరెక్ట్ కాదని తెలిపింది. చిన్న కారణాలకే ఉద్యోగంలో నుంచి తొలగించడం సరికాదని హితవు పలికింది.
2022లో లండన్ కు చెందిన ఎలిజబెత్ బెనాస్సీ అనే యువతి మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కొన్ని రోజుల తర్వాత బెనాస్సీ ఓసారి స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీస్ కు వెళ్లింది. స్పోర్ట్స్ షూ వేసుకున్నందుకు గాను కంపెనీ యాజమాన్యం కోపడడమే కాకుండా బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారని డ్రెస్ కోడ్ పాటించాలనే విషయం తెలియదా అంటూ తనను అవమానించారని వాపోయింది.
ఆపై తనను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలిచ్చారని చెప్పింది. ఎలాంటి నోటీస్ లేకుండా, సడెన్ గా జాబ్ లో నుంచి తీసేయడం అన్యాయమంటూ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. సుదీర్ఘంగా విచారించిన ట్రైబ్యునల్.. తాజాగా తీర్పు వెలువరిస్తూ.. మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్ కంపెనీ తీరు సరికాదని వ్యాఖ్యానించింది. భారీ మొత్తంలో ఫైన్ విధించింది.