Viral: ఎడారిని ముంచెత్తిన నీరు..ఎడారిలో నీరు ఎలా ఉప్పొంగుతుందో .?


రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని మెహన్‌గఢ్‌లో ఓ వ్యక్తి తన స్థలంలో బోరుబావి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.


Published Dec 29, 2024 08:12:00 PM
postImages/2024-12-29/1735483435_video.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : రాజస్థాన్ లో ఓ వింత జరిగింది. మంచి ఎడారి ..ఎటు  చూసినా చుక్క నీరు దొరకని స్థలం. మంచి నీటికే నానా యాతన పడుతున్నారు. ఇలాంటి చోట నీరు వరదై పొంగింది. ఏదో అగ్నిపర్వతం పేలినట్లుగా నీరు ...నురగలు కక్కుతూ బయటకు వచ్చింది. 


రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని మెహన్‌గఢ్‌లో ఓ వ్యక్తి తన స్థలంలో బోరుబావి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. యంత్రాలు తీసుకువచ్చి బోరుబావి తీస్తుండగా.. ఒక్కసారిగా గంగపైకి పొంగి వచ్చింది. అది కూడా భారీ ఉధృతి తో నీరు పైకి రావడంతో చాలా పెద్ద గుంత పడింది. ఈ గుంత లో బావి తవ్వడానికి తీసుకు వచ్చిన జేసీబీ పడిపోయింది, అతిపెద్ద మోటారు పైపు పగిలితే నీరు ఎంతో పైకి ఎగిసిపడినట్లు.. ఈ నీరు అలా భూమి పైకి వస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్ అయ్యారు.


దీనిని వీహెచ్‌పీ నేత వినోద్ బన్సల్ ట్వీట్ చేశారు. ‘నేడు ఎడారి కూడా నీట మునిగింది’ అంటూ ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. జైసల్మేర్‌ ఎడారిలో అంతరించిపోయిన పురాతన తల్లి సర్వసతి నదియే ఈ ప్రవాహ ఉధృతికి కారణం అంటూ వినోద్ బన్సల్ తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu waterleakage viral-video rajasthan-

Related Articles