నానా తంటాలు పడి అక్కడి వరకు చేరుకుంటే పిల్ల ఫ్యూజులు కట్ అయిపోయే ట్విస్ట్ ఇచ్చింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రేమ గుడ్డిది. లేదు ప్రేమ గుడ్డి వారిని చేసేస్తుంది. అందుకే అసలు వివరాలు తెలీకుండా ఎంత వరకైనా వెళ్లిపోతారు. రీసెంట్ గా ఓ ఇండియా కుర్రాడు పాకిస్థాన్ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చేయడానికి పాకిస్థాన్ వెళ్లడానికి ప్రయత్నించాడు. వెళ్లాడు. నానా తంటాలు పడి అక్కడి వరకు చేరుకుంటే పిల్ల ఫ్యూజులు కట్ అయిపోయే ట్విస్ట్ ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన బాదల్ బాబు ను గత వారం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహౌద్దీన్ జిల్లాలో అక్రమంగా సరిహద్దు దాటినందుకు స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడే తన ఫేస్ బుక్ లవ్ స్టోరీ చెప్పాడు. సరే అసలు ఆ పిల్ల ఏం చెప్తుందో చూద్దాం అని పోలీసులు ఆ అమ్మాయితో మాట్లాడితే ..సనారాణి అనే అమమాయి ప్రేమించడానికి ఓకే కాని పెళ్లి మాత్రం తనని చేసుకోలేనని చెప్పేసింది.
బాదల్ బాబు అక్రమంగా సరిహద్దు దాటి మండి బహౌద్దీన్‌లోని మాంగ్ గ్రామానికి సనా రాణిని కలవడానికి చేరుకోగా, అక్కడ చట్టాన్ని అమలు చేసే అధికారులు అరెస్టు చేశారని పోలీసు అధికారి పేర్కొన్నారు. చట్టపరమైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నందున బాబును పాకిస్థాన్ విదేశీ చట్టం సెక్షన్లు 13, 14 కింద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది.