Viral Video: ఇదేం ట్రయాంగిల్ లవ్ స్టోరీ .. స్కూల్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న అమ్మాయిలు !

నా బాయ్ ఫ్రెండ్ నాకే సొంతం అంటూ ఇద్దరు బాలికలు రోడ్డెక్కారు. అంతేనా.. సిగపట్లు పట్టి స్కూల్‌ ఆవరణలోనే పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు


Published Jan 02, 2025 02:06:00 PM
postImages/2025-01-02/1735807113_lovetrianglePHQXFXFscaled.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కాలం మారిపోయింది. వయసుతో సంబంధం లేదు. ప్రేమ ఏ వయసులో మొదలుపెడుతున్నారో..అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకునేలోపే బ్రేకప్ స్టోరీస్...ఇప్పుడు పిల్లలకి మీరేం చెప్పక్కర్లేదు.అంతా సోషల్ మీడియానే . అలా ఉంది పరిస్థితి. అయితే రీసెంట్ గా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫుల్ వైరల్ అవుతుంది.


యూపీ లో ఓ స్కూల్ లో ..నా బాయ్ ఫ్రెండ్ నాకే సొంతం అంటూ ఇద్దరు బాలికలు రోడ్డెక్కారు. అంతేనా.. సిగపట్లు పట్టి స్కూల్‌ ఆవరణలోనే పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. తోటి విద్యార్ధులు ఆపేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఎట్ లాస్ట్ పట్టించుకోకపోతే పోయేలా ఉన్నారని కొంతమంది పెద్ద వాళ్లు జోక్యం చేసుకొని జడలు విడిపిస్తే కాస్త తగ్గారు. 


ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని సింఘ్‌వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీనగర్ సరాయ్‌లో ఉన్న ఓ స్కూల్‌లో ఇద్దరు అమ్మాయిలు అదే స్కూల్లో చదువుతున్న మరో అబ్బాయిని ప్రేమించారు. ఒకే స్కూల్ అయినా ..ఇద్దరు ఒకరే ప్రేమిస్తున్నట్లు తమకు తెలీదు. తెలిసిన కుర్రాడు బయటకు చెప్పలేదు. తీరా విషయం బయట పడ్డాక ఒకరినొకరు తన్నుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ, తోసుకుంటూ నానాయాగి చేశారు. తోటి విద్యార్థినులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా లాభంలేకుండా పోయింది.  ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news girls love-story

Related Articles