ట్రంప్ అక్రమ వలసలపై ఘాటుగా స్పందించాడు. వలసదారులను వెనక్కి తీసుకెళ్లని దేశాలతో తాను వ్యాపారం చేయబోనని ట్రంప్ పేర్కొన్నాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా మరికొద్దిరోజుల్లో బాధ్యతలు చేపడుతున్నారు . డోనాల్డ్ ట్రంప ను టైమ్ మ్యాగజైన్ " పర్సన్ ఆఫ్ ది ఇయర్ " అవార్డుకు ఎంపిక చేసింది.ట్రంప్ అక్రమ వలసలపై ఘాటుగా స్పందించాడు. వలసదారులను వెనక్కి తీసుకెళ్లని దేశాలతో తాను వ్యాపారం చేయబోనని ట్రంప్ పేర్కొన్నాడు.
గతంలో ఎప్పుడు ఇలా లేదని ఇఫ్పుడు మాత్రం వలసదారులు చాలా ఎక్కువయ్యారని అన్నారు. వీరిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోను అని మరోసారి ట్రంప్ స్పష్టం చేశాడు. అమెరికాలోని అక్రమంగా వలస వచ్చేవారిని తిరిగి వారి దేశానికి పంపిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా ఏ దేశమైతే అక్రమ వలసదారులు ఎక్కువగా ఉంటారో ఆ దేశాలతో వ్యాపార సంబంధాలు అమెరికాకు ఉండవని తెలిపారు.
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే పుట్టకతో సంక్రమించే పౌరసత్వం అంశంపై దృష్టి సారిస్తానని చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపర్చిన ‘జన్మహక్కు పౌరసత్వం’ ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.