Pushpa 2: కిస్సిక్ పాటకు డ్యాన్సులు వేసిన వృధ్ధాశ్రమం బామ్మలు !

శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ నెట్టింటిని ఓ ఊపు ఊపేస్తుంది. అయితే ఓ గ్రానీ బ్యాచ్ ఈ పాటకు భలే డ్యాన్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు.


Published Dec 08, 2024 05:56:00 PM
postImages/2024-12-08/1733661133_kissiksong.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పుష్ప 2 ఇప్పుడు థియేటర్లలో సూపర్ సక్సస్ ఫుల్ గా నడుస్తున్న సినిమా . అయితే ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కిస్సుక్కు పాటకు ఇప్పటికే భలే రీల్స్ చేస్తున్నారు. శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ నెట్టింటిని ఓ ఊపు ఊపేస్తుంది. అయితే ఓ గ్రానీ బ్యాచ్ ఈ పాటకు భలే డ్యాన్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. 


ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో అల్లుఅర్జున్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్ణాటక బెలగాంలో ఉన్న శాంతయి వృద్ధాశ్రమంలో ఉన్న కొందరు బామ్మలు కిస్సిక్ పాటకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అసలు డ్యాన్స్ చెయ్యాలనే ఆలోచన రావడమే చాలా బాగుంది. .. ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. బామ్మలు వేసిన స్టెప్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


ఈ  ఆశ్రమంలోని బామ్మలు, తాతయ్యలు రీల్స్ చేయడం మొదటిసారి కాదు. ఇప్పటికే పలు పాటలకు స్టెప్పులు వేశారు. శాంతాయి ఆశ్రమంలో  ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటారు. కొన్ని డ్యాన్సులు చాలా వైరల్ అయ్యాయి కూడా . శాంతి సెకండ్ చైల్డ్ హుడ్ అనే పేరుతో ఉన్న ఈ సోషల్ మీడియా ఖాతాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కిస్సిక్ పాటకు మాత్రం చాలా మంచి అప్లాజ్ వచ్చింది. వైరల్ అవుతుంది కూడా.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shantai Vruddashram (Old Age Home) (@shantai_second_childhood)

newsline-whatsapp-channel
Tags : viral-news sreeleela india pushpa2

Related Articles