చంపేసుకోవడాలే...ఎందుకు ఈ తంటాలు , అసలు ప్రతి జంటకు షరతులు పెట్టేస్తే పోలా అనుకొని కొన్ని కొత్త రూల్స్ తెచ్చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఓయో తెలియని సుద్దపూసలు ఈ రోజుల్లో ఎవరు లేరు. ఒక వేళ మీకు కాని తెలియకపోతే ...మీరు మేలిమి బంగారం అంతే..ఓయో ..ఒక ట్రావెల్ బుకింగ్ సంస్థ . వారికి పెళ్లి తో సంబంధం లేదు ..ఆడ ఆడ , మగ మగ, ఆడ , మగ ఎవరు వెళ్లినా సింగిల్ గా వెళ్లినా రూమ్ ఇస్తారు. ఇన్నాళ్లు ఇదే కథ నడిచింది. పాపం లవర్స్ అంతా కష్టసుఖాలు ఇలానే మాట్లాడుకునే వారు. ఈ మధ్య వీళ్లు కూడా తెలివి మీరిపోయి ...మాటలు కాస్త మరణాలు వరకు వెళ్లిపోతున్నారు. చంపేసుకోవడాలే...ఎందుకు ఈ తంటాలు , అసలు ప్రతి జంటకు షరతులు పెట్టేస్తే పోలా అనుకొని కొన్ని కొత్త రూల్స్ తెచ్చేసింది.
ఓయో హోటల్స్‌లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఫ్రూఫ్ అడగనుంది. అంటే లీగల్ రిలేషన్ షిప్ కే ఇక రూమ్ . ఎందుకంటే ఇంకా లవర్స్ కు లీగల్ డాక్యుమెంట్స్ లేవు కదా ఇండియాలో . ఇలాంటి ఫ్రూఫ్ లేకపోతే- స్థానిక సామాజిక సెన్సిబిలిటీకి అనుగుణంగా, బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటళ్లకు ఓయో ఇచ్చింది.
ఈ నయా రూల్ ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ నుంచి అమలు చేయాలని ఓయో నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మేరఠ్ లో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా మిగిలిన స్ట్రేట్స్ లో అమలు చేస్తాయి. పౌర సమాజం నుంచి తమ సంస్థకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా పెళ్లి కాని జంటలకు బుకింగ్స్ సేవలను నిలిపేయాలన్న నిర్ణయం తీసుకున్నామని ఓయో పేర్కొంది.అయితే ఇదే శాశ్వత విధానం కాదని, కాలానుగుణంగా చెక్ ఇన్ పాలసీని మార్చివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని అవాంఛనీయ సంఘటన వల్ల ఓయో అంటే తప్పుడు ప్లేస్ అనే జనాల్లో పడిపోయింది. అది చెరిపివేయాలనేదే సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.