Viral: నడుస్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన మూడేళ్ల పాప .!

కడపలో మూడేళ్ల పాపకు ఇలాగే జరిగింది. దూసుకెళ్తున్న ట్రైన్ నుంచి జారిపడి ఓ పాప బతికి బట్టగట్టింది.


Published Jul 26, 2024 12:23:33 PM
postImages/2024-07-26/1722014595_64606400imagea51542781726573.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఆవగింజంత  ఆయుష్షు ఉన్నా ... అణుబాంబు కూడా ముట్టుకోలేదు. మనకు భూమ్మీద నూకలు రాసి ఉండాలే కాని ...ప్రళయం వచ్చి బత్రికి వచ్చేస్తాం. కడపలో మూడేళ్ల పాపకు ఇలాగే జరిగింది. దూసుకెళ్తున్న ట్రైన్ నుంచి జారిపడి ఓ పాప బతికి బట్టగట్టింది. కడప నుంచి నంద్యాల వెళ్లే డెమో ట్రైన్ నుంచి కొల్లూరు మండలం తప్పెట్ల దగ్గర మూడేళ్ల పాప కిందపడిపోయింది.


అయితే పడిపోయిన వెంటనే ..పాప తల్లి తోటి ప్రయాణికులు చైన్ లాగడానికి ప్రయత్నించారు. అయినా ట్రైన్ ఆగలేదు. పాప పడటం గమనించిన వెనుక వచ్చే రైలుకు సమాచారం ఇచ్చాడు గ్యాంగ్ మెన్. కొల్లూరు నుంచి గూడ్స్ ట్రైన్‌లో పాపను తీసుకువచ్చి కమలాపురంలో తల్లికి అప్పగించారు. పాపకు వెంటనే  ప్రాథమిక చికిత్స అందించారు డాక్టర్లు.
రైల్వే అధికారులు పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలని తల్లితండ్రులను కోరుతూ ...గూడ్స్ ట్రైన్ డ్రైవర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇఫ్పుడు సోషల్ మీడియా ఈ టాపిక్  వైరల్ అవుతుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu train viral-news

Related Articles