Bhadrachalam: భద్రాద్రి రాములవారి కళ్యాణం చూడడానికి ఫ్రీ టికెట్లు !

ఈ క్రమంలో స్వామివారి కల్యాణం వీక్షించేందుకు టికెట్లకోసం భక్తులు పోటీ పడుతుంటారు. అయితే, ఈసారి దాతలకు ఉచితంగా రాములోరి కల్యాణం టికెట్లు ఇవ్వనున్నారు.


Published Mar 17, 2025 05:16:00 PM
postImages/2025-03-17/1742212059_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. స్వామి వారి కళ్యాణం లోక కళ్యాణం గా భావిస్తారు. ప్రతి యేటా భద్రాచలం దేవస్థానంలో మిథిలా స్టేడియంలో జరిగే ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడడానికి భక్తులు భారీ గా వస్తుంటారు. ఈ క్రమంలో స్వామివారి కల్యాణం వీక్షించేందుకు టికెట్లకోసం భక్తులు పోటీ పడుతుంటారు. అయితే, ఈసారి దాతలకు ఉచితంగా రాములోరి కల్యాణం టికెట్లు ఇవ్వనున్నారు.


ఈ ఏడాది ఏప్రిల్ 6 న శ్రీరామనవమి సంధర్భంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా నిర్వహిస్తారు. అయితే రాముల వారి కళ్యాణానికి ఎవరైతే 50 లక్షలకు పైగా విరాళాలు ఇస్తారో వారికి  శ్రీరామనవమి మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణంలో పాల్గొనేందుకు ఉచితంగా రెండు టికెట్లు ఇస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక సెక్టార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మార్చి 26 లోపు రూ.50 లక్షలకు పైగా విరాళాలు ఇచ్చిన భక్తులు దేవస్థానంలో లెటర్ ను అందజేయాలని ఈ వో సూచించారు. అయితే ఏప్రిల్ 6న రాముల వారి కళ్యాణం కారణంగా ఏప్రిల్ 4 నుంచి 7వ తేదీ వరకు దేవస్థానం తరపున కాటేజీలు , గదులు ఇవ్వలేమని బుకింగ్ ఉండదని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో కోరారు.హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి మండా వెంకటేశ్వరరావు సీతారాముల కల్యాణానికి రూ.13వేల విలువైన 500 గ్రాముల ముత్యాల తలంబ్రాలను ఈవోకు అందజేశారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kalyanam-kamaneeyam sriram

Related Articles