Harsha pawan:యూట్యూబర్ హర్షపై కేసు నమోదు..ట్విస్ట్ ఏంటంటే..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం చాలామంది శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది కొన్ని కొన్ని టాస్కులు చేయబోయి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలా


Published Aug 23, 2024 01:46:43 PM
postImages/2024-08-23/1724401003_harshapawan.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం చాలామంది శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది కొన్ని కొన్ని టాస్కులు చేయబోయి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలా యూట్యూబ్ లో ఎంతో ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ హర్ష పవన్ తాజాగా గాల్లో డబ్బులు ఎగరవేస్తూ  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాడు. ఇంకేముంది ఈయనపై  పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.

డబ్బులు విసిరేస్తూ రోడ్డుపై హల్చల్ చేసినందుకు హర్ష పవన్ అనే యువకుడి మీద సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయగా  కేసు నమోదు అయింది. ఇక ఇక్కడే కాకుండా కేపిహెచ్ పీలో మరో కేసును నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు.  ఈ విధంగా హర్ష పవన్ పై పలు కేసులు పడటమే కాకుండా పలు న్యూస్ ఛానళ్లు ఆయనను తిట్టిపోస్తూ ప్రచారం చేశాయి. దీనిపై స్పందించినటువంటి హర్ష పవన్ న్యూస్ ఛానల్ వాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. పవన్ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. టీవీ9, ఎన్టీవీలో నేను పైసలు గాల్లోకి ఎగరేసానని  వార్తల మీద వార్తలు వేస్తున్నారు. మరి నేను ఎగరేసింది మాత్రమే మీరు హైలెట్ చేస్తున్నారు నేను వేలాది మందికి లక్షల రూపాయల సాయం చేశాను దాన్ని ఎప్పుడు హైలెట్ చేయలేదని అంటూ ప్రశ్నించారు. నేను డబ్బు ఎగిరేసినవి మూడే వీడియోలు. హెల్ప్ చేసినవి వేలాది వీడియోలు ఉన్నాయి. మరి వాటిని మీకు ప్రసారం చేయడం రాదా ఓన్లీ నెగిటివ్ మాత్రమే తీసుకుంటారా అంటూ ప్రశ్నించాడు.

https://x.com/TeluguScribe/status/1826870425562792419?s=08

టీవీ9, ఎన్టీవీ మీకు దండం పెడుతున్న దయచేసి ఇలాంటి నెగిటివ్ వార్తలు మాత్రమే హైలెట్ చేసి మమ్మల్ని బ్యాడ్ చేయకండి, మంచి పనులను కూడా ప్రసారం చేయండి అంటూ వేడుకున్నాడు. ప్రజలారా మీకు తెలుసు కదా కొన్ని లక్షలు పెట్టి నేను ఎంతమందికి హెల్ప్ చేశానో, చెప్పుకోవడం ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు టైం వచ్చింది కదా అని ఈ విషయం చెబుతున్నాను దయచేసి నన్ను బ్యాడ్ చేస్తూ వీడియోలు ప్రసారం చేయకండి అంటూ న్యూస్ ఛానల్ వాళ్లను కౌంటర్ ఇచ్చాడు హర్ష పవన్. ప్రస్తుతం ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu criminal-case money youtuber harsha-pawan

Related Articles