ఏపీ శకటాన్ని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మలు కాన్సెప్ట్ తో రూపొందించారు. ఎటు చూసినా కలర్ ఫుల్ గా ..చాలా క్రియేటివ్ గా నిలుస్తాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండియా రిపబ్లిక్ డే సంధర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించిన పరేడ్ కార్యక్రమం దశ సమగ్రతను సత్తాను . సాంస్కృతిక వైవిధ్యాన్ని , రక్షణ రంగ పాటవాన్ని చాటేలా అత్యంత ఘనంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా శకటం ఈ పరేడ్ లో పాల్గొంది.
ఏపీ శకటాన్ని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మలు కాన్సెప్ట్ తో రూపొందించారు. ఎటు చూసినా కలర్ ఫుల్ గా ..చాలా క్రియేటివ్ గా నిలుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వివిధ సందర్భాల్లో ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను కొనియాడారు. దేశ విదేశాల్లో ఎంతో ఖ్యాతి పొందిన ఈ బొమ్మలే కాన్సెప్ట్ గా నేడు ఏపీ శకటం రిపబ్లిక్ డే వేడుకల్లో అందరిని దృష్టిని ఆకర్షిచింది.
ముందు భాగంలో వినాయకుడి బొమ్మ , వెనుక భాగంలో వెంకటేశ్వరసామి బొమ్మలు ఏర్పాటు చేశారు. బొమ్మలు బొమ్మలు ...ఏటికొప్పాక బొమ్మలు అంటూ సాగే గీతానికి కొందరు కళాకారులు నర్తిస్తుండగా ఏపీ శకటం ఠీవిగా ముందుకు వెళ్లింది.