తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ , కేరళ , నార్త్ లో అన్ని రాష్ట్రాల్లోని నదుల్లోనూ పుణ్యస్నానాలు చేస్తుంటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మౌని అమావాస్య సంధర్బంగా దేశ వ్యాప్తంగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఈ రోజున త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అయితే పుణ్యనదుల్లో , సముద్రాల్లో స్నానం చేస్తే చాలా మంచిదని వేదాలు , పురాణాల్లో చెప్పినట్లు నమ్ముతారు. మహాకుంభమేళాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో భక్తులు పుణ్య స్నానాలు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ , కేరళ , నార్త్ లో అన్ని రాష్ట్రాల్లోని నదుల్లోనూ పుణ్యస్నానాలు చేస్తుంటారు.
తమిళనాడులోని తామరి భరణి, మధ్యప్రదేశ్‌లోని పిప్రా, హరిద్వార్‌లోని గంగా నదిలో పుణ్యస్నానాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భక్తులు గోదావరి, కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ రోజు పుణ్యస్నానాలు చేసి శివున్ని ప్రార్ధిస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు.